Japanese MiaWowki System | Man Made Forestry | Spreading in Telangana

 

Japanese MiaWowki System | Man Made Forestry | Spreading in Telangana

 

Japanese MiaWowki System | Man Made Forestry | Spreading in Telangana

 

   

  •  

     

     

 

     
  •  
  •  

 

     
    Japanese MiaWowki System | Man Made Forestry | Spreading in Telangana
     
     
     
     
     
     
    కాకులు దూరని కారడవి, చీమలు చేరని చిట్టడవి! చిన్నతనంలో కథల్లో వినే ఉంటాం! కథల్లోనే కాదు..! అప్పట్లో నిజంగా ఇలాంటి అడవులు ఉండేవి. ప్రస్తుతం అవి ఊహలకే పరిమితం అవుతు న్నాయి. ఎక్కడ అడవి కనిపించినా.. ధ్వంసం చేసి బహుళ అంతస్థుల భవనాలు కట్టేస్తున్నాం..! ఫలితంగా... అటవీ విస్తీర్ణం తగ్గిపోతోంది. ఈ దుష్ప్రభావం ఇప్పటికే కళ్లకు కడుతోంది కూడా..! తూతూమంత్రంగా మొక్కలు నాటటం వాటి సంరక్షణ మరవటం! అంతటా ఇదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం...హరితహారం కార్యక్రమంలో విప్లవాత్మక మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. మనకు మనముగా ఓ అడవి సృష్టించుకునేలా ప్రోత్సహిస్తోంది. ఇదే...మియావాకీ విధానం..! ఇప్పుడిప్పుడే దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ సంస్కృతి విస్తరిస్తోంది. అందుకే...రాష్ట్రంలోనూ ఇదే విధానం అమలుపరుస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఇప్పటికే కొన్నిజిల్లాల్లో ఇందుకు సంబంధించిన కార్యాచరణ మొదలైంది. కొన్ని చోట్ల విద్యాసంస్థలు కూడా ఇదే బాట పడుతూ ఆదర్శంగా నిలుస్తున్నాయి #IdiSangathi