ప్రేమజంటను విడదీసిన తల్లిదండ్రులు

 

ప్రేమజంటను విడదీసిన తల్లిదండ్రులు

 

ప్రేమజంటను విడదీసిన తల్లిదండ్రులు

 

   

 •  

   

   

 

     
 •  
 •  

 

   
  ప్రేమజంటను విడదీసిన తల్లిదండ్రులు
   
   
   
   
   
   
  ఐదు నిమిషాల్లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతున్న ప్రేమజంటను విడదీశారు అమ్మాయి తరపు కుటుంబసభ్యులు, బంధువులు. పెద్దలను కాదని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకోబోతున్న జంటపై దాడి చేసి విడగొట్టారు. సినీ ఫక్కీలో జరిగిన ఘటన నిజామాబాద్‌లో బుధవారం చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో బైక్‌లు, ఆటోల్లో ఆర్యసమాజ్‌కు చేరుకున్న అమ్మాయి తరపు కుటుంబసభ్యులు, బంధువులు పెళ్లిని నిలిపేయాలంటూ ఆర్య సమాజ్ సభ్యులను కోరారు. ఏదైనా సమస్య ఉంటే బయట తేల్చుకోవాలని వారు చెప్పడంతో అమ్మాయి(సౌజన్య)ని లాక్కెళ్లిపోయారు. ఇంతలో వరుడు(ప్రాణదీప్) అడ్డుపడటంతో అతడ్ని చితకబాదారు. తమ రావడానికి నిరాకరిస్తున్న అమ్మాయిని కూడా కొట్టారు. ఆ తర్వాత ఆమెను భుజాన వేసుకుని బైక్‌పై ఇంటికి తీసుకెళ్లారు. దీంతో నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న ఆ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటవకుండానే విడిపోయారు. ఈ ఊహించని ఘటనతో ఆర్య సమాజ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, బదిలీల హడావుడిలో ఉన్న పోలీసులు.. ఇక్కడికి వచ్చేసరికి అంతా జరిగిపోయింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.