డీఎస్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, చర్యలు తీసుకోండి.. రేపు నాపైనా ఇంతే: కేసీఆర్‌కు కవిత

డీఎస్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, చర్యలు తీసుకోండి.. రేపు నాపైనా ఇంతే: కేసీఆర్‌కు కవిత

డీఎస్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, చర్యలు తీసుకోండి.. రేపు నాపైనా ఇంతే: కేసీఆర్‌కు కవిత

 •  

 •  
 •  

  డీఎస్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, చర్యలు తీసుకోండి.. రేపు నాపైనా ఇంతే: కేసీఆర్‌కు కవిత
   
  Telangana Rastra Samithi party leader D Srinivas likely to join Congress Party? తెలంగాణ రాష్ట్ర సమితి నేత డీ శ్రీనివాస్ మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆయన మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. తెరాసలో తనకు తగిన ప్రాధాన్యత, గ్రూపు రాజకీయాలు తదితర కారణాలతో ఆయన పార్టీని వీడే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. డీఎస్ తీరు నేపథ్యంలో ఆయనపై పార్టీ అధిష్టానం కూడా వేటు వేసేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. కొద్ది రోజులుగా డీఎస్ పని తీరుపై ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏమాత్రం సంతృప్తికరంగా లేరని తెలుస్తోంది. దీంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నారని సమాచారం. బుధవారం నాడు కవిత క్యాంప్ కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా తెరాస నేతలు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. దాదాపు జిల్లా నాయకత్వం మొత్తం డీఎస్‌కు వ్యతిరేకంగా ఒక్కటైంది. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా కవిత, తెరాస నాయకులు.. డీఎస్ తీరుపై విమర్శలు గుప్పించారు.