కర్నూలు అభ్యర్థులుగా బుట్టా, ఎస్వీలను ప్రకటించిన లోకేష్

 

కర్నూలు అభ్యర్థులుగా బుట్టా, ఎస్వీలను ప్రకటించిన లోకేష్

 

కర్నూలు అభ్యర్థులుగా బుట్టా, ఎస్వీలను ప్రకటించిన లోకేష్

 

   

 •  

   

   

 

     
 •  
 •  

 

   
  కర్నూలు అభ్యర్థులుగా బుట్టా, ఎస్వీలను ప్రకటించిన లోకేష్
   
   
   
   
   
   
  తన జిల్లా పర్యటనలో మంత్రి నారా లోకేష్ 2019కి గాను కర్నూలు లోకసభ, అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. కర్నూలు శాసన సభకు ఎస్వీ మోహన్ రెడ్డి, ఎంపీగా బుట్టా రేణుక పోటీ చేస్తారని తెలిపారు. దీంతో రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ వర్గం అసంతృప్తికి లోనైంది. రాబోయే ఎన్నికల్లో మీకు రెండు ఓట్లు ఉంటాయని, ఓ ఓటు మోహన్ రెడ్డికి, మరో ఓటు బుట్టా రేణుకకు వేసి భారీగా మెజార్టీతో గెలిపించాలని లోకేష్ అన్నారు. వారిని సభలకు పంపించే బాధ్యత తనది అన్నారు. ఎవరూ ఊహించని విధంగా లోకేష్ ఈ ప్రకటన చేసారు. కర్నూలు అసెంబ్లీ స్థానం టిక్కెట్‌ను ప్రస్తుత ఎమ్మెల్యే ఎస్వీతో పాటు టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ ఆశిస్తున్నారు. సర్వే ఆధారంగా సీఎం చంద్రబాబు టిక్కెట్ ఇస్తారని, అది టీజీ భరత్‌కే వస్తుందని టీజీ వర్గీయులు ఆశిస్తున్నారు. The tour of Panchayat Raj and IT Minister Nara Lokesh generated political heat here on Monday following his announcement of TDP candidates for Kurnool Parliament and Assembly seats for the next elections. #buttarenuka #svmohanreddy #andhrapradesh #2019loksabhapolls #naralokesh