భర్త మీద కసితో కుమార్తెను నీళ్లలో ముంచి చంపిన తల్లి...!

భర్త మీద కసితో కుమార్తెను నీళ్లలో ముంచి చంపిన తల్లి...!

భర్త మీద కసితో కుమార్తెను నీళ్లలో ముంచి చంపిన తల్లి...!

 •  

 •  
 •  

  భర్త మీద కసితో కుమార్తెను నీళ్లలో ముంచి చంపిన తల్లి...!
   
  భర్తకు అక్రమ సంబంధం ఉందని భార్య అనుమానం పెంచుకుంది. భర్త మీద కసితో భార్య కన్న కుమార్తెను నీళ్లలో ముంచి కిరాతకంగా చంపేసింది. తల్లిదండ్రుల గొడవకు రెండున్నర ఏళ్ల చిన్నారి హత్యకు గురైన ఘటన తమిళనాడులోని కరూర్ జిల్లా తిరుప్పూర్ సమీపంలోని సామలపురంలో జరిగింది. బిడ్డను హత్య చేసిన తమిళ్ ఇసక్కి (21) అనే కిరాతకురాలిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. తల్లి చేతిలో హత్యకు గురైన చిన్నారి శివన్యశ్రీ అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. శివనశ్రీ నానమ్మ ధనలక్ష్మి ఫిర్యాదు చెయ్యడంతో మంగళం పోలీసులు కేసు నమోదు చేసి తమిళ్ ఇసక్కిని అదుపులోకి తీసుకున్నారు. తన కుమార్తె శివనశ్రీ తల మీద కట్టితో కొట్టానని, తరువాత ఇంటిలోని ప్లాస్టిక్ నీళ్ల తొట్టలో తల ముంచి హత్య చేశానని తమిళ్ ఇసక్కి అంగీకరించిందని పోలీసులు అన్నారు.