జై తెలంగాణ అంటూ పవన్ ఉద్వేగం : తెలంగాణ కోసం నా రక్తం ఇస్తా !

 

జై తెలంగాణ అంటూ పవన్ ఉద్వేగం : తెలంగాణ కోసం నా రక్తం ఇస్తా !

 

జై తెలంగాణ అంటూ పవన్ ఉద్వేగం : తెలంగాణ కోసం నా రక్తం ఇస్తా !

 

   

 •  

   

   

 

     
 •  
 •  

 

   
  జై తెలంగాణ అంటూ పవన్ ఉద్వేగం : తెలంగాణ కోసం నా రక్తం ఇస్తా !
   
   
   
   
   
   
  Pawan Kalyan starts his speech elangana Tour Day 2 with "Jai Telangana" word. Watch Pawan Kalyan Telangana Tour Day 2 Press Meet full video జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంగళవారం రెండో రోజు పర్యటిస్తున్నారు. ఆయన ఉదయం శ్వేత హోటల్ నుంచి శుభం గార్డెన్ చేరుకున్నారు. అక్కడ జనసేన కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన జై తెలంగాణ నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ తనకు జన్మను ఇస్తే తెలంగాణ పునర్జన్మను ఇచ్చిందని చెప్పారు. 2009లో కొండగట్టు అంజన్న తనను కాపాడారని, అందుకే ఈ గడ్డపై నుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తున్నానని, తెలంగాణకు తాను చివరి శ్వాస వరకు రుణపడి ఉంటానని చెప్పారు. వందేమాతరం లాగే జై తెలంగాణ నినాదం నా అణువణువునా ఉందన్నారు. జై తెలంగాణ అంటే ఏమిటని అడుగుతారేమో.. చీకటి నుంచి స్వేచ్ఛ వైపు తీసుకు వచ్చిన నినాదమే జై తెలంగాణ అని అభిప్రాయపడ్డారు. ఆయన మాట్లాడుతుండగా అభిమానులు సీఎం జిందాబాద్, సీఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అభిమానులు ఉత్సహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాంటి తెలంగాణ నుంచి జనసేన పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావడం తనకు ఆనందంగా, గర్వంగా ఉందన్నారు.